May 24,2023 23:50

ఆందోళన చేపడుతున్నగి గిరిజనులు, నాయకులు

ప్రజాశక్తి -రోలుగుంట:సాగులో ఉన్న గిరిజనులను హక్కు పట్టాలు ఇవ్వకుండా. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు ఇచ్చిన పట్టాలు తక్షణమే రద్దు చేయాలని కోరుతూ రోలుగుంట మండలం రత్నం పేట శివారు పనసల పాడుకు చెందిన ఆదివాసీ గిరిజనులు సిపిఎం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బుధవారం నిరసన చేపట్టారు. ఏళ్ల తరబడి సాగులో ఉన్న గిరిజనులకు కాకుండా సాగులో లేని వారికి పట్టాలు ఇవ్వడం పై. పనసలపాడు ఆదివాసి గిరిజనులు జగనన్నకు చెపుదాం. కార్యక్రమానికి ఫిర్యాదు చేశారు. అనంతరం గ్రామంలో చేతులు జోడించి జిల్లా కలెక్టర్‌ గారు. మా ఆదివాసి గిరిజనులకు జరిగిన అన్యాయంపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరుతూ. విన్నుత్నంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా గిరిజనులు మాట్లాడుతూ, రోలుగుంట మండలం రత్నంపేట పంచాయితీ శివారు పనసలపాడు రెవిన్యూ పరిధిలో 12 కుటుంబాలు గత కొన్నేళ్లగా ఆ భూములలో సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు. జగనన్న సమగ్ర భూ సర్వే కార్యక్రమం తీసుకు రావడంతో తమకు న్యాయం జరుగుతోందని సంబర పడ్డామని, సర్వే లో భూ స్వాములకు పట్టాలు ఇచ్చేందుకు చర్యలు చేప్పట్టడం తో తమకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రోన్‌ సర్వే ద్వారా తమకు న్యాయం జరుగుతుందని భావించి ఆదివాసులు సంబరం పడ్డామన్నారు.ప్రత్యేకించి అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ గారు మా పనసలపాడు గ్రామానికి వచ్చి ఎటువంటి అవకతవకలు జరగకుండా సర్వే రికార్డ్స్‌ ప్రకారంగా సర్వే చేసి పనసలపాడు రెవెన్యూ పరిధిలోని సర్వే రికార్డ్స్‌ సెక్షన్‌ 9(2) ప్రకారం సర్వే చేసిన రిపోర్టుని రైతుల అభిప్రాయాలు తీసుకొని. డిఎల్‌ఆర్‌ డ్రాఫ్ట్‌ ల్యాండ్‌ రిజిస్టర్‌ నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. రెవెన్యూ అధికారులు సర్వే నెంబర్‌ 6-1,6-9,8-1. నెంబర్లలో విస్తీర్ణం లో భూములు గిరిజనులు పట్టాదారులు సాగు దారులకు కాదని సాగులో లేనటువంటి వారికి పట్టాదారు పాస్‌ పుస్తకాలు ఇవ్వడం దారుణమన్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు సమగ్ర సర్వే నిర్వహించి సాగు దారులు అయిన ఆదివాసులకు అన్యాయం చేయకుండా అక్రమంగా పట్టాలు పొందిన పట్టాలను వెంటనే రద్దు పరచి సాగు దారులుకు ఇవ్వాలని, అలాగే ఈ సమస్య పై అనకాపల్లి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ప్రత్యేక విచారణ నిర్వహించాలన్నారు. బాధిత ఆదివాసి గిరిజనులు చేతులు జోడించి కలెక్టర్‌ వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గేమ్మిల చిన్నబ్బాయి, గెమ్మిలా అప్పారావు, చందర్రావు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు.