Aug 17,2023 18:59

ప్రజాశక్తి - నూజివీడు రూరల్‌
         నూజివీడు పట్టణంలో రిటైర్డ్‌ స్పెషల్‌ జ్యూడిషియల్‌ మెజిస్ట్రేట్‌ అమెరిశెట్టి జయకుమార్‌ (70) మృతికి పట్టణంలోని ప్రముఖులు సంతాపం తెలిపారు. రమణక్కపేట గ్రామానికి చెందిన జయకుమార్‌ న్యాయవాదిగా వృత్తిని ప్రారంభించి అంచలంచెలుగా ఎదిగి స్పెషల్‌ జ్యూడిషియల్‌ మెజిస్ట్రేట్‌గా సేవలందించారని తెలిపారు. ఆయన మృతికి నూజివీడు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సత్యప్రకాష్‌, పలువురు న్యాయవాదులు సంతాపం తెలిపారు.