మాట్లాడుతున్న సిఐ సుధాకర్
ప్రజాశక్తి-పాడేరుటౌన్: మండలంలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన వంజంగి హిల్స్ కు వచ్చే పర్యాటకులకు వంజంగి సమీపంలో ఏర్పాటు చేసిన రిసార్ట్స్ యజమానులు పర్యాటకులకు ఇబ్బందులు లేకుండా వసతులు సక్రమంగా అందించాలని సిఐ బి.సుధాకర్ ఆదేశించారు. సోమవారం ఆయన రిసార్ట్స్ యజమానులతో సిఐ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. ప్రకృతి అందాలు, మంచు మేఘాలను తిలకించేందుకు వచ్చే పర్యాటకులు నివాసం ఉండే రికార్డులను సరిగా మెంటినెన్స్ చేయాలని సూచించారు. ముఖ్యంగా ప్రతీ రిసార్ట్‌లో సిసి కెమారాలను ఏర్పాటు చేయాలన్నారు. అసాంఘిక కార్యక్రమాలకు తావ ులేకుండా చూడాలని యజమానులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు జి.లక్ష్మణరావు, జి.రంజిత్ కుమార్, రిసార్ట్స్ యజమానులు పాల్గొన్నారు.










