విద్యార్థులను అభినందిస్తున్న వీసీ ప్రసాదరెడ్డి
ప్రజాశక్తి-విశాఖపట్నం : ఆంధ్రవిశ్వవిద్యాలయం నుంచి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి ఏయూ పరిధిలోని ఆదిత్య కళాశాల నుంచి పి.రమ్య, ఏయూ ఫార్మశీ కళాశాల నుంచి జె.వాసు, స్పేసెస్ డిగ్రీ కళాశాల నుంచి విఎస్‌ఎన్.లక్ష్మణ్‌లు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వీరిని ఏయూ వీసీ ఆచార్య పివిజిడి ప్రసాదరెడ్డి తన కార్యాలయంలో అభినందించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య వి.కృష్ణమోహన్, ఎన్‌ఎస్‌ఎస్ సమన్వయకర్త ఆచార్య ఎస్.హరనాథ్ తదితరులు పాల్గొన్నారు.










