
న్యూఢిల్లీ : దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) తన తాజా బులిటెన్‌లో పేర్కొంది. పశ్చిమబెంగాల్, ఒడిశా, జార్ఖండ్, బీహార్, మధ్యప్రదేశ్, నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర, ఉత్తరప్రదేశ్, కర్నాటక, కేరళ, ఈశాన్య రాష్ట్రాల్లో ఆగస్టు 9 వరకు భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఆయా రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురవనున్న కారణంగా వాతావరణశాఖ ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది.