Feb 26,2023 00:03

రాజబాబు మృతదేహం

అనుమానాలున్నాయంటున్న బంధువులు
ప్రజాశక్తి -అడ్డతీగల :
రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న అడ్డతీగల మండలం బొడ్లంక గ్రామానికి చెందిన కన్నోజి రాజబాబు శుక్రవారం తెల్లవారుజామున ఆసుపత్రిలో మృతి చెందారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్న రాజబాబును రాజమండ్రి ఆస్పత్రులులో చేర్పించారు. వైద్య సేవలు అందిస్తుండగా మృతి చెందినట్లు హాస్పటల్‌ వర్గాలు తెలిపినట్లు మృతుడు అన్నయ్య రామకృష్ణ తెలిపారు. రాజబాబు మృతి పట్ల పలు అనుమానాలు ఉన్నాయని రామకృష్ణ, వారి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఒక్కొక్కరి దగ్గర ఒక్కో విధంగా చెబుతున్నారని, వారి మాటలు పలు అనుమానాలకు తావిస్తున్నాయని మృతుని అన్నయ్య రామకృష్ణ తెలిపారు. రాజబాబు మృతదేహాన్ని రాజమండ్రి హాస్పిటల్‌లో శివపంచినామాకు ఉంచారని సర్పంచ్‌ బోనం రాఘవ తెలిపారు.