
వినతిపత్రాన్ని చూపుతున్న ఎమ్మెల్యే
ప్రజాశక్తి -కోటవురట్ల:రోడ్డు, పాఠశాల నిర్మాణానికి గొట్టువాడ శివారు అణుకు గిరిజన గ్రామస్తులు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష సోమవారం నాటికి 11వ రోజుకు చేరుకుంది. మండలంలో వివిధ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన స్థానిక ఎమ్మెల్యే గొల్ల బాబురావు రోడ్డు, పాఠశాల నిర్మాణంకు జిల్లా కలెక్టర్ కు విన్నవించిన వినతిపత్రాన్ని శిబిరం వద్ద దీక్ష నిర్వహిస్తున్న వారికి ఎమ్మెల్యే చూపించారు,దీక్ష శిబిరానికి చేరుకొని దీక్ష విరమించాలని కోరారు. సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు అప్పలరాజు మాట్లాడుతూ, స్పష్టమైన హామీ ఇచ్చే వరకు దీక్షను విరమించేది లేదని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మండల సిపిఎం నాయకులు డేవిడ్‌రాజు, అణుకు గిరిజన గ్రామస్తులు పాల్గొన్నారు.