ప్రజాశక్తి - కొమరాడ : మండలంలో గిరిజనులకు ఎంతో అవసరమైన పూర్ణపాడు-లాబేసి వంతెన పనులు ప్రారంభించాలని కోరుతూ తలపెట్టనున్న రిలే నిరాహార దీక్షలకు గిరిజనులు పెద్ద ఎత్తున తరలిరావాలని వంతెన సాధన కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి పిలుపునిచ్చారు. శనివారం కూనేరు సంతలో వంతెన సాధన కమిటీ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. సంతలో నిరాహారదీక్షల పోస్టర్లను పట్టుకొని ప్రచారం ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు సాంబమూర్తి మాట్లాడుతూ ఇప్పటికైనా మన పాలకులు ఇచ్చిన మాట ప్రకారం వెంటనే కాంట్రాక్టర్‌ను రప్పించి వంతెన పనులు పున: ప్రారంభించాలని కోరుతూ ఈనెల17 నుంచి 26 వరకు కోమట్లపేట వద్ద రిలే నిరార దీక్షలు, 28న తహశీల్దార్ కార్యాలయం వద్ద జరిగే ధర్నా జయప్రదం చేయాలని కోరారు. ప్రచారంలో పలువురు గిరిజనులు పాల్గొన్నారు.










