
ప్రజాశక్తి-అనకాపల్లి
జిల్లాలో సెల్ ఫోన్లు పోగొట్టుకున్న 116 మంది బాధితులకు రికవరీ చేసిన ఫోన్లను బుధవారం ఎస్పీ మురళీకృష్ణ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంతవరకూ బాధితులు పోగొట్టుకున్న మొత్తం రూ.68 లక్షల విలువైన 357 మొబైల్ ఫోన్లను ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుండి రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు చెప్పారు. మొదటి విడతలో 131 మొబైల్ ఫోన్లు (విలువ రూ.25 లక్షలు), రెండో విడతలో 110 మొబైల్ ఫోన్లు (రూ.23 లక్షలు), 3వ విడత (ప్రస్తుతం) 116 ఫోన్లు (రూ.20 లక్షలు) జిల్లా పోలీస్ కార్యాలయంలో మొబైల్ రికవరీ మేళా కార్యక్రమాల ద్వారా అందించామని తెలిపారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితులు జిల్లా పోలీస్ వాట్సాప్ నెంబర్ 95052 00100కు హారు అని టైప్ చేసి, aసజూఎశీbఱశ్రీవ్‌తీaషసవతీ.ఱఅ లింక్ నొక్కడం ద్వారా పోయిన మొబైల్స్ ఫిర్యాదుల స్వీకరణకు ఎఫ్‌ఐఆర్ కట్టకుండా, పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండా సులభతరం చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా మొబైల్స్ ట్రేస్ చేసిన ఐటి కోర్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు బి.విజయభాస్కర్, పి.సత్యనారాయణరావు, ఇన్‌స్పెక్టర్లు లక్ష్మణ్ మూర్తి, చంద్రశేఖర్, అప్పలనాయుడు, పైడపునాయుడు, ఐటి కోర్ ఎస్సై రఘు వర్మ, సిబ్బంది పాల్గొన్నారు.