Oct 08,2023 16:51

బాధితురాలుకు మొబైల్ ఫోన్ ను రికవరీ చేస్తున్న జిల్లా ఎస్పీ

రికవరీ చేసిన 510 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేత
జిల్లా పోలీసు కార్యాలయంలో రెండవ సారి  మొబైల్ రికవరీ  మేళా కార్యక్రమం
జిల్లా ఎస్పీ కె. రఘువీర్ రెడ్డి
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్

     జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ప్రజలు పోగొట్టుకున్న 510 మొబైల్ ఫోన్లను బాధితులకు  పోలుసులు రికవరీ చేశారు.వీటి విలువ సుమారు 86,57,000 రూపాయలు ఉంటుంది. ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయం లో బాధితులకు జిల్లా ఎస్పీ అందజేశారు. పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ లను పోలీసులు రికవరీ చేయడంతో బాధితులు ఆనందం వ్యక్తం చేశారు. రెండవ సారిగా "చాట్ బోట్ " సేవలతో సాంకేతిక పరిజ్ఞానంతో 510 సెల్ ఫోన్లను నంద్యాల  పోలీసులు రికవరీ చేశారు.మీ మొబైల్ ఫోన్ పోతే   9121101107 అనే నెంబర్ కు HAI అని SMS  చేసిన ఒక లింక్ వస్తుంది ఆ లింకును క్లిక్ చేసి సెల్ ఫోన్ పోగోట్టుకున్న మొబైల్ ఫోన్  వివరాలు నమోదు చేయండి.  ఏలాంటి రుసుము చెల్లించకుండా ఉచితంగా సెల్ ఫోన్ రికవరీ చేస్తామని జిల్లా ఎస్పీ కె. రఘువీర్ రెడ్డి తెలిపారు. జిల్లాలోనే అతి తక్కువ సమయంలోనే ఇటీవల  వివిధ రాష్ట్రాల నుండి రికవరీ చేసిన 847 మొబైల్ ఫోన్లను మొదటి విడతగా అందజేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు.ప్రస్తుతం రెండవ సారిగా "చాట్ బోట్ " సేవలతో సాంకేతిక పరిజ్ఞానంతో 510 సెల్ ఫోన్లు రికవరీ చేశామన్నారు.ఇటీవల కాలంలో మొబైల్ మన జీవితంలో ఒక భాగమైందన్నారు. అటాచ్ మెంట్స్, సెంటిమెంట్స్, పర్సనల్ సమాచారం, ఎన్నో సేవలు మొబైల్ ద్వారా వినియోగిస్తామన్నారు. మొబైల్ ఫోన్ లతో పాటు  ప్రజల ఆస్తిని కాపాడాల్సిన భాద్యత పోలీసులపై ఉందన్నారు.  జిల్లా వ్యాప్తంగా పలు కారణాలతో సెల్ ఫోన్లు పోగొట్టుకున్న భాదితులు ఇచ్చిన వివరాలను బట్టి  510 ఫోన్లు రికవరీ చేశామన్నారు. సెల్ ఫోన్లు పోగొట్టుకున్న వాటి పరిష్కారం పై నంద్యాల జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు.డిజిపి, ప్రభుత్వం ఆదేశాల మేరకు మొబైల్ రికవరీ మేళా నిర్వహించామన్నారు.నంద్యాల  పోలీసు సేవలను ప్రజలు సద్వినియోగం  వినియోగించుకోవాలన్నారు.  జిల్లా ఎస్పీకి,  పోలీసుయంత్రాంగానికి బాదితులు కృతజ్ఞతలు తెలిపారు.9121101107 నంబర్ వాట్స్ యాప్ కు SMS చేసి ఈ లింకు ను క్లిక్ చేసి ఆ వివరాలను సమర్పించండి. మీ మొబైలు ను తిరిగి పొందండి.  ఇచ్చిన  లింక్ ను క్లిక్ చేసి  మొబైల్ కాలమ్ నందు ఈ క్రింది వివరాలను మీ పేరు, మీ జిల్లా , మీ పోలీస్ స్టేషన్ పరిధి ,మీ మొబైలు కు సంబంధించిన ఐ ఎం ఈ ఐ-1, ఐ ఎం ఈ ఐ - 2 వివరాలు  ప్రస్తుతం ఉపయోగిస్తున్న మొబైలు నంబర్ / మొబైలు పోయినప్పుడు సదరు మొబైల్ నందు మీరు వాడినా మొబైల్ నెంబర్ కాంటాక్ట్ వివరాలు సబ్ మిట్ చేయాలని  మీరు ఫిర్యాదు చేసినచో  పోలీస్ వారు మీ మొబైలు ను మీకు తిరిగి తెప్పించి ఇవ్వగలరని జిల్లా ఎస్పీ  ప్రజలకు విజ్ఞప్తి చేశారు.