Sep 07,2023 19:21

రికార్డులు పరిశీలిస్తున్న డిప్యూటీ డిఇఒ

రికార్డులు పరిశీలిస్తున్న డిప్యూటీ డిఇఒ
రికార్డులు పరిశీలన
ప్రజాశక్తి-సంగం:స్థానిక జెడ్‌పి హైస్కూల్లో కావలి డిప్యూటీ డిఇఒ రఘురామయ్య సందర్శించారు.పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. భోజనం నాణ్యతతో ఉండాలని సూచించారు. అనంతరం రికార్డులు పరిశీలించి ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు .ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. పదవ తరగతి విద్యార్థులపై ప్రత్యేక దష్టి సారించాలని సూచించారు.బడి బయట పిల్లలు లేకుండా ప్రతీ పిల్లవాడు బడిలో ఉండే విధంగా గట్టి చర్యలు చేపడుతున్నామన్నారు.కార్యక్రమంలో ఎంఇఒ మల్లయ్య,హెడ్మాస్టర్‌ బుజ్జయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.