Jul 30,2023 21:06

మార్కెట్లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న టమోటా

కలికిరి : స్థానిక కలికిరి మార్కెట్‌లో రికార్డు స్థాయిలో టమోటా ధరలు పలుకుతున్నాయి. గత నెల రోజుల నుండి ఒక ట్రే టమోటా ధర వెయ్యి రూపాయల నుండి రూ.2400 రూపాయలు వరకు ధరలు పలుకుతూ కలికిరి మార్కెట్‌ చరిత్రలోనే రికార్డు నెలకొల్పాయి. గత సంవత్సరం పూర్తిగా టమాట ధరలు లేక రైతులకు నిరాశ మిగిల్చగా, జనవరి నుంచి సాధారణ రేట్లే కొనసాగుతుండడంతో అధిక మంది రైతులు టమోటా పంట వైపు ఆసక్తి చూపడం లేదు. ఇతర రాష్ట్రాలలో భారీ వర్షాలతో పంట మొత్తం దెబ్బతినడంతో మార్కెట్‌కు ఎక్కువ టమోటాలు రాకపోవడంతో ఉన్నట్టుండి ధరలు ఆకాశాన్ని అంటాయి. టమోటా మార్కెట్లో గత వారం రోజులుగా 15 కేజీల ట్రే రూ.1500 నుంచి 2400 పలుకుతూ ధరలు నిలకడగా కొనసా గుతున్నాయి. మూడు నెలల పాటు టమోటా ధరలు ఇలాగే కొనసా గునుండగా కలికిరి చుట్టుపక్కల ప్రాంతాల్లోని రైతులు వందల ఎకరాల్లో టమోట పంటను పండించడానికి సిద్దమవుతున్నారు. వినియోగదారులు ధరలు ఎప్పుడు తగ్గుతాయోనని ఎదురు చూస్తున్నారు.