ప్రజాశక్తి -కంచరపాలెం: హెచ్‌పిసిఎల్ ఆపరేటివ్ టెక్నీషియన్స్ ఉద్యోగాలకు ఎంపికైన కంచరపాలెం ప్రభుత్వ కెమికల్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు శనివారం ప్రిన్సిపల్ డాక్టర్ కె.వెంకటరమణను మర్యాదపూర్వకంగా కలిసి కతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా హెచ్‌పిసిఎల్ కెమికల్ విభాగానికి సంబంధించి 92 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయగా, వేలాదిమంది పరీక్షలు రాశారు. విశాఖ ప్రభుత్వ కెమికల్ ఇంజనీరింగ్ కాలేజ్( గైస్)కు చెందిన 66 మంది ఉద్యోగాలకు ఎంపికై రికార్డు సష్టించారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసిన ఇక్కడి విద్యార్థులకు పూర్వ విద్యార్థుల సహకారంతో ప్రిన్సిపాల్ వెంకటరమణ ఆధ్వర్యంలో పోటీ పరీక్షకు తర్ఫీదునిచ్చి తీర్చిదిద్దారు. దీంతో వారు పరీక్షలో ప్రతిభ చూపి ఉద్యోగాలకు ఎంపికై ప్రస్తుతం హెచ్‌పిసిఎల్‌లో శిక్షణ పొందుతున్నారు. వీరంతా ప్రిన్సిపాల్ వెంకటరమణను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాలేజ్ కెమికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ బి.వి లక్ష్మణరావు పాల్గొన్నారు










