Aug 28,2023 20:18

మాట్లాడుతున్న మాల మహానాడు రాయలసీమ అధ్యక్షులు రంగయ్య

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
దళితులకు రిజర్వేషన్‌ ప్రకారం రాజకీయాల్లో ప్రభుత్వాలు చోటు కల్పించాలని మాల మహానాడు రాయలసీమ అధ్యక్షులు రంగయ్య డిమాండ్‌ చేశారు. సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగం ప్రకారం అన్ని కులాలకూ, మతాలకూ, ప్రాంతాలకూ సమన్యాయం చేయాలని కోరారు. ఈడబ్ల్యుఎస్‌ ప్రకారం అగ్రకులాల్లోనూ పేదలు ఉన్నారని రిజర్వేషన్‌ కల్పించిన ప్రభుత్వం, దళితులకు రిజర్వేషన్‌ ప్రకారం ఎందుకు స్థానం కల్పించడం లేదని ప్రశ్నించారు. దళితులు పొందుతున్న రిజర్వేషన్లను ఓర్వలేక, దళితులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదుగుతున్నారని జీర్ణించుకోలేక అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన పేదలు ఉన్నారని 10 శాతం శాతం రిజర్వేషన్లు ప్రకటించుకోవడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. మాలమహానాడు నాయకులు పరమేష్‌, ముని, రామ్‌, ఎంకన్న, బలరామ్‌, నరసింహా, బంగారప్ప, గోపాల్‌ పాల్గొన్నారు.