
నీటిని విడుదల చేస్తున్న నాయకులు
ప్రజాశక్తి-గొలుగొండ:నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేష్ ఆదేశాల మేరకు గొలుగొండ మండలం రావణాపల్లి రిజర్వాయర్ నీటిని ఆదివారం గేట్లు ఎత్తి విడుదల చేశారు. రైతులు నీటిని సద్వినియోగం చేసుకొని, పొదుపుగా వాడుకోవాలని పలువురు నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ అధ్యక్షులు కిలపర్తి పెద్దిరాజు, ఏఏసి చైర్మన్ కొల్లు సత్యనారాయణ, కొమిర సర్పంఛ్ అల్లు రాజుబాబు, మాజీ పిఎసిఎస్ అధ్యక్షులు కొల్లు అప్పలనాయుడు, ఏటిగైరంపేట మాజీ ఎంపిటిసి పాము రాజుబాబు, గ్రామ కమిటీ అధ్యక్షులు సుర్ల రమణ, మాజీ వైస్ ప్రెసిడెంట్ కొల్లు రాము, సచివాలయ కన్వీనర్ మడగల పైడియ్య, బూత్ కన్వీనర్ కొల్లు గంగునాయుడు, రిజర్వాయర్ రైతులు పాల్గొన్నారు.