Oct 08,2023 16:54

గ్రామస్తులతో మాట్లాడుతున్న ఫారెస్ట్ అధికారి

రిజర్వ్ ఫారెస్ట్ లోకి ఎవరు వెళ్ళరాదు
నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు
ప్రజాశక్తి - కొత్తపల్లి

     నల్లమల్ల అడవులకు సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలు రిజర్వ్ ఫారెస్ట్ లోకి ఎవరు వెళ్ళరాదని నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఫారెస్ట్ సెక్షన్ అధికారి నాగేశ్వరరావు తెలిపారు.ఆదివారం కొత్తపల్లి మండలం లోని బలపాలతిప్ప సిద్దేశ్వరం గ్రామాల ప్రజలను జనాల గూడెం లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడుతూ రిజర్వ్ ఫారెస్ట్ లోకి ఎవరు వెళ్ళరాదు అన్నారు. చట్ట విరుద్ధంగా రిజర్వ్ ఫారెస్ట్ లోకి వెళ్లిన వ్యక్తులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రిజర్వు ఫారెస్ట్ లో ఎక్కువ శాతం అడవి జంతువులు తిరుగుతుంటాయని వాటికి ఇబ్బంది కలిగించరాదని తెలిపారు. రిజర్వు ఫారెస్ట్ లో ఎలాంటి జీవాలు మేపుకోవడం చేయరాదని ప్రజలకు తెలిపారు. ఫారెస్ట్ అధికారుల నిబంధనలు పాటించి అడవి జంతువులను అడవులను రక్షించుకోవడం అందరి బాధ్యతగా తీసుకోవాలన్నారు. అధికారుల నిబంధనలు పాటించకుండా రిజర్వ్ ఫారెస్ట్ లో వెళ్లిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సమావేశంలో ఎఫ్ బి ఓ పాములేటి ఫారెస్ట్ సిబ్బంది పలు గ్రామాల గ్రామస్తులు ఉన్నారు.