ప్రజాశక్తి-ఆదోనిరూరల్
సచివాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ తెలిపారు. మంగళవారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గ్రామ సచివాలయం పరిధిలో జరుగుతున్న క్రయ, విక్రయాలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజలకు సేవలు అందించేందుకు, భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సచివాలయంలోనే సేవలు అందిస్తోందని తెలిపారు. ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. జగనన్న భూహక్కు, భూరక్ష పథకంలో భాగంగా మొదటి విడతలో ఆదోని డివిజన్‌లో 57 గ్రామాల్లో 1.20 లక్షల పై చిలుకు ఎకరాలు రీసర్వే పూర్తి చేసుకున్న భూములకు గ్రామ సచివాలయంలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైందని తెలిపారు. సబ్ రిజిస్ట్రార్ రాజశేఖర్, ఆదోని రీసర్వే ఉప తహశీల్దార్ పెద్దయ్య పాల్గొన్నారు.
రికార్డులను పరిశీలిస్తున్న సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్










