ప్రజాశక్తి - నందవరం
40 ఏళ్లు అనుభవంలో ఉన్న అడంగల్, ఆర్‌ఒఆర్‌లో హక్కుదారుని పేరు ఎందుకు ఎక్కించడం లేదంటూ నవ్యాంధ్ర ఎంఆర్‌పిఎస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి సుమాల చార్లెస్ మాదిగ ప్రశ్నించారు. మంగళవారం తహశీల్దార్ నిత్యానంద రాజును కలిసి బాధితుల తరఫున ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నందవరం మండలం పూలచింత గ్రామం రెవెన్యూ పరిధిలో సర్వే నెంబరు-1లో పోతురాజు సుజ్ఞానమ్మ 0.73 ఎకరాలు సాగులో ఉందని తెలిపారు. ఇందుకు సంబంధించి ఒరిజినల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు ఉన్న అడంగల్, ఆన్‌లైన్‌లో ఎక్కించి పట్టాదారు పాసు పుస్తకం ఎందుకు ఇవ్వడం లేదని తహశీల్దార్‌ను ప్రశ్నించారు. తక్షణమే అసలైన హక్కుదారులకు ఆ సర్వే నెంబర్‌పై పట్టాదారు పాసు పుస్తకం కల్పించాలని కోరారు. లేకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామన్నారు. బాధితులు నగేష్, సుజ్ఞానమ్మ పాల్గొన్నారు.
తహశీల్దార్‌కు వినతిపత్రం అందిస్తున్న నాయకులు










