Nov 03,2022 00:13

మాట్లాడుతున్న సబ్‌ రిజిస్ట్రార్‌ వెంకటేశ్వరరావు

ప్రజాశక్తి - కె.కోటపాడు
భూములు కొనుగోలు చేసుకున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని, అటువంటి భూములకే చట్టబద్ధత ఉంటుందని సబ్‌ రిజిస్ట్రార్‌ బంగారి వెంకటేశ్వరరావు అన్నారు. మండలంలోని చౌడువాడలో గ్రామ సచివాలయం వద్ద బుధవారం భూముల రిజిస్ట్రేషన్‌పై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజిస్ట్రేషన్‌ ఉంటే కోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుందన్నారు. రిజిస్ట్రేషన్‌ లేని భూములకు చట్టబద్రత ఉండదని, ఆ భూములపై యజమానికి పూర్తిస్థాయిలో హక్కులుండవని పేర్కొన్నారు. భూముల రిజిస్ట్రేషన్‌ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భూములు రిజిస్ట్రేషన్‌పై ఎటువంటి సందేహాలున్నా తమ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో వివాహ రిజిస్ట్రేషన్లు కూడా చేయించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి దాడి ఎరుకునాయుడు, పంచాయతీ కార్యదర్శి నక్క రామనాయుడు, వార్డు సభ్యులు, సచివాలయం సిబ్బంది, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు.