
ఫొటో : రీసర్వే చేపడుతున్న తహశీల్దారు ఎం వి సుధాకర్‌రావు
రీసర్వేతో భూ సమస్యలు పరిష్కారం
ప్రజాశక్తి-సీతారామపురం : రీ సర్వేతో ప్రజల భూ సమస్యలు పరిష్కారం అవుతాయని తహశీల్దార్ ఎం.వి.సుధాకర్ రావు తెలిపారు. బుధవారం మండలంలోని నేమల్లదిన్నే రెవెన్యూ పరిధిలో భూ సర్వే కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ పరంగా సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలు భూ సమస్యలను పరిష్కరించుకోవచ్చని ఆయన సూచించారు. అనంతరం సింగారెడ్డిపల్లి, నెమళ్లదిన్నే సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. సచివాలయ సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో సర్వేయర్ శ్రీకాంత్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.