రెంటచింతల: మండలంలోని వివిధ గ్రామాల్లో భూముల రీసర్వేకు సంబంధించి ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలు చేశారు? ఇంకా చేయాల్సింది ఎంత? ఎప్పటికి సర్వే పూర్తవుతుంది ? ఇప్పటి వరకు ఎన్ని సర్వేరాళ్లు వచ్చాయి అనే అంశాలపై గురజాల ఆర్డీవో కె. అద్దయ్య మంగళవారం తహశీల్దార్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అద్దయ్య మాట్లాడుతూ భూ రీ సర్వేలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని, సమస్యలు ఏవైనా ఉంటే యజమానితో చర్చించాలని సూచించారు. పశర్ల పాడులో 2170.62 ఎకరాలు, మిట్ట గుడిపాడులో 3400 ఎకరాల సర్వే జరుగుతోందని, 50 శాతం సర్వే పూర్త యిందని తహశీల్దార్ కె.పుల్లారావు తెలిపారు. సమా వేశంలో డిటీ రాజారావు, ఆర్ ఐ కాంతారావు. సర్వేయర్ సుధాకర్ పాల్గొన్నారు.










