దుగ్గిరాల: ట్రైన్ కలెక్టర్ల బృందం శుక్రవారం మండలంలోని తుమ్మపూడిలో భూమి రీ సర్వే విధానాన్ని పరి శీలిం చారు. బ్రిటిష్ హయాంలో రీ సర్వే జరపటానికి ఉప యోగించిన పరికరాలను పరిశీలించారు.ప్రస్తుతం రీ సర్వేలో ఏ విధమైన డ్రోన్ టెక్నాలజీని ఉపయోగిస్తోంది, ఓఆర్‌ఐ మ్యాప్ తయారు చేసే విధానం, తయారు చేసే రికార్డుల గురించి ట్రైనింగ్ కలెక్టర్లకు అవగాహన కల్పిం చారు. కార్యక్రమంలో కమిషన్ ఆఫ్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ వారి కార్యాలయానికి చెందిన పి వి ఎస్ కుమార్ ఎపిహెచ్‌ఆర్‌డి కార్యాలయానికి చెందిన అడ్మిన్ రవీంద్ర, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే పి.శ్రీనివాస్, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే కోటిరెడ్డి, తహశీల్దార్ కె.మల్లేశ్వరి, సర్వేయర్ గోపాల్ పాల్గొన్నారు.










