Oct 22,2023 00:12

ప్రజశక్తి - చీరాల
నెలాఖరులోపు భూముల రీ సర్వే పూర్తి చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ కె రామచంద్రారెడ్డి సిబ్బందికి సూచించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సచివాలయ అడ్మిన్లు, ప్లానింగ్ సెక్రటరీలతో శనివారం సమీక్ష నిర్వహించారు. పట్టణంలో చేపడుతున్న సర్వేపై పలు అంశాలను చర్చించారు. పట్టణంలోని ఇళ్లను, ఖాళీ స్థలాలను, ప్రభుత్వ భవనాలను ఆన్లైన్లో పొందుపరిచేందుకు రీ సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటికి భద్రత ఏర్పడుతుందని అన్నారు. ఆన్లైన్లో ఇంటి యజమానికి సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుందని తెలిపారు. సచివాలయ సిబ్బంది వచ్చిన సమయంలో ఇంటి యజమానులు సరైన డాక్యుమెంట్ల జిరాక్స్‌లు అందజేయాలని అన్నారు. సచివాలయ సిబ్బంది బాధ్యతతో పనిచేసి నెలాఖరులోపు రీ సర్వే ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్ఐ ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.