ముప్పాళ్ల: రైతుల సమక్షంలో భూముల రీ సర్వే పనుల గురించి చర్చించి త్వరితగతిన పూర్తి చేయాలని మం డల రెవెన్యూ అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ.శ్యాంప్రసాద్ ఆదేశించారు. తహశీల్దార్ కార్యా లయాన్ని శుక్రవారం జెసి తనిఖీ చేశారు. ఈ సం దర్భంగా మండలంలో జరుగుతున్న రీసర్వే మూడో విడత పనులను ఆయన పరిశీలించారు. మండల రెవెన్యూ అధికారులతో అసైన్డ్ భూములు, ఇనాం భూములు, మ్యుటేషన్ కన్వర్షన్,సబ్ డివిజన్స్, ఎఫ్ లైన్ పిటిషన్ వ్యవసాయ భూముల మార్పులు వంటి విష యాలపై సుదీర్ఘంగా చర్చించి సలహాలు అందజేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలో రికార్డులను పరి శీలించి తగు సూచనలు అందజేశారు. కార్యక్రమంలో తహశీల్దార్ భవానీశంకర్, డిటి లక్ష్మీ ప్రసాద్, పాల్గొన్నారు










