కడప : జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం ద్వారా చేపట్టిన ఫేజ్ -2 రీసర్వే పనులు, ప్రాధా న్యత భవనాల నిర్మాణ లక్ష్యాన్ని నిర్దేశిత గడు వులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు,జె లను ఆదేశించారు. శనివారం రాజధాని అమరా వతి నుంచి వీడియో కాన్ఫెరెన్సు ద్వారా 'జగనన్నకు చెబుదాం', 'జగనన్న భూ హక్కు- భూ రక్ష పథకం' ప్రాధాన్యత భవనాల నిర్మాణాల తదితర అంశాల్లో ఇప్పటి వరకు సాధించిన పురోగతి మొదలైన అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి సమీక్ష చేశారు. కార్యక్రమనికి కలెక్టరేట్‌లోని విసి హాలు నుండి కలెక్టర్‌తోపాటు జెసి గణేష్ కుమార్, డిఆర్‌ఒ గంగాధర్ గౌడ్ హాజరయ్యారు. విసి అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో ప్రారంభించిన 'జగనన్నకు చెబుదాం' కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థవంతంగా, అత్యంత నాణ్యమైన, సంతప్త స్థాయిలో పరిష్కారాన్ని అందించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలో ప్రాధాన్యత భవనాల నిర్మాణాల పూర్తికి రోజువారి లక్ష్యాలు నిర్దేశించి త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుం టున్నట్లు పేర్కొన్నారు. రెండవ దశలో 89 గ్రామాల్లో చేపట్టిన జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం ద్వారా మొత్తం 64 గ్రామాల్లో రీసర్వే, 32 గ్రామాల్లో స్టోన్ ప్లాంటేషన్ పూర్తిచేశామని చెప్పారు. కార్యక్రమంలో సిపిఒ వెంకట్రావు, జడ్‌పి సిఇఒ సుధాకర్ రెడ్డి, డిఎంహెచ్‌ఒ నాగరాజు, పిఆర్ ఎస్‌ఇ శ్రీనివాసులురెడ్డి, ల్యాండ్స్ సర్వే ఏడీ మురళీ కష్ణ, డిస్ట్రిక్ట్ ఆరోగ్యశ్రీ కో- ఆర్డినేటర్ బాలంజనేయులు పాల్గొన్నారు.మాట్లాడుతున్న కలెక్టర్ విజరురామరాజు










