Nov 16,2022 23:28

జ్యోతి ప్రజ్వళనతో ప్రారంభిస్తున్న మేయర్‌

ప్రజాశక్తి -కంచరపాలెం : విద్యార్థులలో సృజనాత్మకతను వెలికి తీసేందుకు టెక్‌ ఫెస్టులు ఎంతో దోహదపడతాయని విశాఖ నగర మేయర్‌ గొలగాని హరి వెంకట కుమారి అన్నారు. ఏయూ రీజియన్‌లోని పాలిటెక్నిక్‌ కళాశాల టెక్‌ ఫెస్ట్‌ను కంచరపాలెం పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రిన్సిపల్‌ జివివి. సత్యనారాయణతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ విద్యార్థులలో నైపుణ్యాభివృద్ధిని పెంచేందుకు ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తుందన్నారు.పాలిటెక్నిక్‌ విద్యార్థులకు మెరుగైన ఉపాధి అవకాశాలు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకోవలన్నారు.
ఎమ్మెల్సీ పివిఎన్‌ మాధవ్‌ విద్యార్థుల ప్రాజెక్టులను పరిశీలించి విద్యార్థులకు సలహాలు సూచనలు అందించారు. ఈ ఫెస్టులో 22 ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌ విద్యార్థులు 126 ప్రాజెక్టులతో పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ సాంకేతిక విద్యాశాఖ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌, కాలేజ్‌ గవర్నింగ్‌ బాడీ చైర్మన్‌ ఎస్‌వియుఎం. ప్రసాద్‌. ప్రభుత్వ కెమికల్‌ ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ కెవి రమణ, పెందుర్తి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ ఒఎన్‌డి యన్‌.చంద్రశేఖర్‌, అనకాపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ ఐవిఎస్‌ శ్రీనివాసరావు, చోడవరం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ ఒఎస్‌డి ఎ.నాగరాజు, పాడేరు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ కె.సుజాత పాల్గొన్నారు.