ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు :రీ సర్వేతో భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించినట్లయిందని వైసీపీ జిల్లా అధికార ప్రతినిధ, సర్పంచ్ తలమంచి సురేంద్ర బాబు పేర్కొన్నారు. తోటపల్లి గూడూరు మండలం కోవెరపా ళెం గ్రామ పంచాయతీలో సోమవారం జగనన్న భూహక్కు భూసర్వే రీ సర్వే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం సురేంద్ర బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో భూముల సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం రీ సర్వే ప్రక్రియ చేపట్టడం జరిగిందన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రీ సర్వే ప్రక్రియ శరవేగంగా సాగుతోందని సురేంద్ర బాబు తెలిపారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమం ఇప్పటికే అనేక మైలురాళ్లు అధిగమించిందన్నారు. తొలి దశలో 2 వేల గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేసి, దేశంలోనే ప్రప్రథమంగా ఆ గ్రామాలకు డిజిటల్ రికార్డులను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందని సురేంద్ర బాబు చెప్పారు.
భారత దేశ చరిత్రలో ఇప్పటివరకు ఏ రాష్ట్రంలోనూ ఒక్క గ్రామంలో కూడా భూముల రీ సర్వే పూర్తి కాలేదని అయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మినహా మిగిలిన రాష్ట్రాల్లో ఇప్పటికీ బ్రిటిష్ కాలం నాటి భూమి రికార్డులే ఇప్పటికీ చెలామణిలో ఉన్నాయన్నారు. వాటి ఆధారంగానే భూముల కార్యకలాపాలు, రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని చెప్పారు. అయితే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం 2 వేల గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేసి కొత్త భూముల రికార్డులను డిజిటల్ రూపంలో తయారు చేసిందన్నారు. ఏపీలో రూపొందుతున్న డిజిటల్ భూ రికార్డులు ఇతర రాష్ట్రాలకు సైతం మోడల్‌గా నిలిచాయని, ఈ ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని సురేంద్ర బాబు పేర్కొన్నారు. కోవెరపాళెం గ్రామ పంచాయతీలో జగనన్న వైద్యులు డాక్టర్ శేషయ్య (జనరల్ సర్జన్ గుంటూరు) పొలంలో సురేంద్ర బాబు రీ సర్వే ప్రక్రియ ప్రారంభించారు.కార్యక్రమంలో విఆర్‌ఓ గుంటూరు సుబ్రహ్మణ్యం, సర్వేయర్ నయాజ్, మాజీ సర్పంచ్ తలమంచి రామయ్య, రైతులు ముత్యాలు సుధాకర్ పాల్గొన్నారు.










