Jun 20,2023 23:27

రీ సర్వేతో సాగు రైతులను గుర్తించాలి

ప్రజాశక్తి-అనంతగిరి: సాగు రైతులకు అపోహలు లేకుండా భూ రీ సర్వేను వేగవంతం చేయాలని స్థానిక జెడ్పిటిసి దీసరి. గంగరాజు అన్నారు. మండలంలోని అనంతగిరి పంచాయతీ పరిధి రాజుపాక గ్రామంలో రెండు బృందాలు ఏర్పడి నిర్వహిస్తున్న రీ సర్వే పనితీరును ఆయన సందర్శించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిరాయితి భూములు పూర్వకాలం నుండి సాగులో ఉన్న బంజర్‌, ప్రభుత్వ భూముల్లో సాగు చేస్తున్న రైతులను గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఎస్‌. నాగులు సర్వేర్లు భాస్కర్‌ బాలకష్ణ సిబ్బంది రైతులు చిన్న గంగులు భీమన్న లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.