సచివాలయ అధికారులతో మాట్లాడుతున్న జెసి నవీన్
- జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్
ప్రజాశక్తి - బూర్జ: సమగ్ర భూ రీ సర్వేలో అలసత్వం వహిస్తే సహించేది లేదని జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ హెచ్చరించారు. మండలంలోని అప్పలపేట సచివాలయాన్ని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ పంచాయతీ పరిధిలోని నరేంద్రపురం, పాలవలస, మసానుపుట్టి, కొరగాంలో రీ సర్వే నత్తనడకన సాగడానికి కారణాలు ఏమిటని ప్రశ్నించారు. ఈనెల 22వ తేదీ లోగా ఆయా గ్రామాల్లో రీ సర్వేను పూర్తి చేసి నివేదికను అందజేయాలని ఆదేశించారు. సిబ్బంది ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఐ చీమల వెంకటరమణ, గణపతిరావు, సచివాలయ సిబ్బంది ఉన్నారు.










