Jun 21,2023 00:31

గణపురంలో రీ సర్వే పనులను పరిశీలిస్తున్న జాయింట్‌ కలెక్టర్‌

నాదెండ్ల: మండలంలోని గణపురంలో రీ సర్వే పనులను పల్నా డు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ మంగళవార అకస్మికతనిఖీ చేశారు. రీ సర్వే పనులు ఎలా జరుగుతున్నాయో ఆరా తీశారు. రీ సర్వే పనులను వేగవంతం చేయాలని చెప్పిన ఆయన రికార్డులను పరిశీలించారు. ఉదయం 7 గంటల నుండి రీసర్వే పనులు మొదలవుతున్నాయని ఈ పనులకు సంబంధించి నాలుగు టీంలు ద్వారా పని జరుగుతోందని తహశీల్దార్‌ ఎవి రమణ తెలిపారు. రీ సర్వే పనులకు రైతులు కూడా సహకరిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్‌, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు
66 గ్రామాల్లో రీ సర్వే పూర్తి
ఈపూరు: నరసరావుపేట డివిజన్‌ పరిధిలో 66 గ్రామాలలో భూ రీ సర్వే పూర్తయిందని, ఇందులో 42 ఎకరాలకు భూ హక్కు పత్రాలు పంపిణీ చేస్తామని ఆర్డిఒ శేషిరెడ్డి అన్నారు. స్థానిక తహశీల్దార్‌ కార్యాలయంలో భూ రీ సర్వే ప్రక్రియ, భూ వివరాల నమోదును ఆన్‌లైన్‌లో ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆర్డిఓ మాట్లాడుతూ ఇనిమెళ్ళకు చెందిన రైతు చొక్కా వెంకటేష్‌ సర్వే నెంబరు 578లో 1.40 సెంట్లు భూమికి గాను రీ సర్వేలో 1. 21 సెంట్లు ఉన్నట్లు అధికారులు చూపారని, ఈ విషయమై స్పందనలో ఫిర్యాదు చేయగా అదే సర్వే నెంబర్‌ లోని ముళ్ళపాటి వీరయ్య తన 86 సెంట్లు భూమిని చొక్కా వెంకటేష్‌ పాస్‌ పుస్తకంలో ఎక్కించినట్లు ఫిర్యాదు చేశా రన్నారు. ఇద్దరి వద్ద నుండి ఈసీ, లింకు డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించి సమస్యను పరిష్కరించాలని తహ సీల్దార్‌ ఆర్‌.వెంకటేశ్వర్లు నాయక్‌కు సూచించారు. రీ సర్వేకు సంబంధించి సమస్యలు ఏవైనా ఉంటే మొబైల్‌ మెజిస్ట్రేట్‌, స్థానిక డిప్యూటీ తహశీల్దార్‌ ఆధ్వర్యంలోనే సమస్యలు పరిష్కరించుకోవాలని తెలిపారు. మండలంలో బొగ్గరం, గుండేపల్లి, వనికుంట గ్రామాల్లో రీ సర్వే ప్రక్రియ పూర్తయిందని, వనికుంటలో భూ హక్కు పత్రాలు పంపిణీకి సిద్ధంగా ఉంచామన్నారు. చిట్టాపురం, దాసులపల్లె,ఈపూరు, కొండాయపాలెం, కొండ్రముట్లలో రీ సర్వే పూర్తయి, భూ రికార్డు తయారు చేస్తున్నామన్నారు. అగ్నిగుండాల, ఇనిమెళ్ళ, కొచ్చర్లలలో రీ సర్వే జరుగుతుం దని, రైతులు తమ వద్ద ఉన్న పత్రాలను సర్వే అధికారులకు చూపించి సహకరించాలని కోరారు. కొన్ని సాంకేతిక సమ స్యల కారణంగా సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలి చిందని త్వరలో పూర్తి స్థాయిలో జరుగుతాయన్నారు.