Jan 22,2023 15:50

ప్రజాశక్తి-చిన్నగొట్టిగల్లు: ప్రభుత్వ మద్యం దుకాణాల్లో నిర్ణీత ధరలకే మద్యం అమ్మకాలు జరపాలని లేకుంటే కేసులు బనాయిస్తామని చిత్తూరు మద్యం డిపో సబ్ ఇన్స్ పెక్టర్ గుంటూరు రనామకృష్ణ శాస్త్రి సిబ్బందిని హెచ్చరించారు. ఆయన పీలేరు ఎక్సైజ్ స్టేషన్ పరిదిలోగల వివిధ ప్రభుత్వ మద్యం దుకాణాలను ఆకస్మికంగా తనిఖీలచేశారు. మండలంలోని దుకాణాలను తనిఖీ చేసిన అనంతరం ఆయన  మాట్లాడుతూ  ప్రభుత్వం మద్యం ధరల పట్ల  పరభాష తెలిసిన వ్యక్తుల ద్వారా మద్యం దుకాణాల్లో డెకాయ్ ఆపరేషన్ నిర్వహించామన్నారు. నిల్వగల స్టాకును సిబ్బంది సహాయంతో ప్రతి బాక్సు కిందికి దింపించి చూశామన్నారు. సిబ్బంది అవకతవకలకు పాల్పడితే వారి భవిష్యత్తు అంధకారమేనని, పొరపాట్లకు తావివ్వకుండా డిపార్ట్మెంట్ కు మంచి పేరు తీసుకురావాలని దుకాణాల సిబ్బందిని కోరామన్నారు. ఈ తనిఖీల్లో కానిస్టేబుల్లు లోకనాథం, కవిత మరియు సూపర్వైజర్లు పాల్గొన్నారు