
న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విటర్ ఖాతాను తొలగించలేదని ట్విటర్ ప్రకటించింది. పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నట్లు తెలిపింది. ఢిల్లీ అత్యాచార బాధితురాలికి న్యాయం జరగాలని, వారికి న్యాయంజరిగేంత వరకు తాను వారి వెంటే ఉంటానని పేర్కొంటూ రాహుల్ గాంధీ ట్విటర్‌లో పేర్కొన్నారు. ట్వీట్‌తో పాటు వారి కుటుంబాన్ని పరామర్శిస్తున్న ఫొటోను జత చేశారు. అయితే చిన్నారులపై లైంగిక దాడి కేసులో.. వారి కుటుంబసభ్యుల ఫొటోలను పోస్ట్ చేయడంతో ట్విటర్ నిబంధనలను ఉల్లంఘించిందంటూ ఆ పోస్ట్‌ను ట్విటర్ తొలగించిన సంగతి తెలిసిందే. దీంతో రాహుల్ ఖాతాను నిలిపివేశారంటూ కాంగ్రెస్ శనివారం ఆరోపించింది. అయితే తాము ఖాతాను నిలిపివేయలేదని ట్విటర్ ప్రకటించింది. ఏదైనా ఖాతను తొలగించిన, నిలిపివేసిన అది గ్లోబల్ వ్యూ నుండి కూడా తీసివేయబడుతుందని ట్విటర్ పేర్కోంది. నిబంధనలను ఉల్లంఘించిన వారి ఖాతా 24 గంటల పాటు నిలిపివేయబడుతుందని తెలిపింది.