
ప్రజాశక్తి - పాచిపెంట : రహదారుల నిర్మాణంతో గిరిజనుల అభివృద్ధి సాధ్యపడుతుందని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. మండలంలోని మారుమూల గిరిశిఖర ప్రాంతంలో నిర్మిస్తున్న రహదారులను పరిశీలించేందుకు శుక్రవారం కలెక్టర్ విస్తతంగా పర్యటించారు. ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజనలో భాగంగా మండలంలోని వేటగాని వలస తంగ్లాం రోడ్ నుండి మూటకూడు వరకు అంచనా విలువ రూ.618 లక్షల వ్యయంతో సుమారు 5.8 కిలోమీటర్ల మేరకు ఆర్‌పిపిఎల్‌డబ్ల్యూవి కింద నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. రోడ్ నిర్మాణ పనుల వివరాలను పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ అధికారి జి.మల్లికార్జున్‌ను అడిగితెలుసుకున్నారు. రహదారుల నిర్మాణాలను నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ రహదారుల నిర్మాణాలకు అవసరమైన అటవీ అనుమతులు పొందివున్నం దున పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. వర్షాల కారణంగా నీటి ప్రవాహంతో రహదారులు దెబ్బతినకుండా బెర్మ్‌ల నిర్మాణాలను ప్రత్యేక శ్రద్ధతో నాణ్యతా ప్రమాణాలు అనుసరించి చేపట్టాలన్నారు. కల్వర్టు నిర్మాణాలపై ఆరా తీయగా 15 సింగిల్ పైప్, 2 రెండు వరుసల నిర్మాణాలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. అనుకూల సమయం అయినందున పనులను ప్రణాళికా బద్ధంగా సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. గిరిజన ప్రాంతాల ప్రజల రాకపోక లకు, రవాణా సౌకర్యాలు కలిగేలా వీలైనంత త్వరగా పూర్తిస్థాయిలో రహదారులను వినియోగం లోకి తీసుకురావాలని సూచించారు. పనులు పరిశీలించి సంతప్తి వ్యక్తం చేశారు. అనంతరం మాతుమూరులో కొత్తగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని, రైతు భరోసా కేంద్రాన్ని పరిశీలించారు. పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి సేవలు అందించేందుకు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశిం చారు. కార్యక్రమంలో తహశీల్దార్ ఆర్.రాజశేఖర్, పంచాయితీరాజ్ శాఖ డిఇ చిన్నం నాయుడు, ఆర్‌ఐ రమణ, గుత్తేదారు శేషారెడ్డి, పాల్గొన్నారు.