కడప ప్రతినిధి : జిల్లాలోని ఆర్‌అండ్‌బి డిపార్టుమెంట్ పరిధిలోని రహదారులకు మహర్శశ పట్టనుంది. ప్రభుత్వం కడప, అన్నమయ్య జిల్లాలో తొమ్మిది రహదారుల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. రూ.33.20 కోట్లు కేటాయిస్తున్నట్లు జిఒను జారీ చేసింది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ చేసిన పనులకు నిధులు ఇవ్వలేక చతికితలపడుతున్న తరు ణంలో కొత్త రహదారి నిర్మాణాలకు టెండర్లు వేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు వస్తారా అనేది సందేహాలకు తావిస్తోంది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో అన్ని అనుకున్నట్లు నడిస్తే నెలాఖరు నాటికి తొమ్మిది రహదారులు మెరుగులు దిద్దుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు. అన్నమయ్య జిల్లా లోని ఆరు రహదారులకు రూ.20 కోట్లు కడప జిల్లాలోని మూడు రహదారులకు రూ.10.20 కోట్ల చొప్పున కేటాయించింది. అన్నమయ్య జిల్లాలోని రాయచోటి, కోడూరు, రాజంపేట, తంబళ్లపల్లి, మదనపల్లి, కడప జిల్లాలోని జమ్మలమడుగు, బద్వేల్, మైదుకూరు నియోజకవర్గాల పరిధిలో రహదారులకు మోక్షం లభించింది.
నూతన రహదారులివే..!
అన్నమయ్య జిల్లాలో రాయచోటి నియోజకవర్గ పరిధిలోని రాజంపేట, కదిరి, తణు కూరులో రూ.1.40 కోట్లతో 2.350 కిలో మీటర్ల మేర రహదారి నిర్మాణ పనులు చేపట్టనున్నారు. రైల్వేకోడూరు నియోజకవర్గ పరిధిలోని రూ.2.80 కోట్లతో 12.100 కిలో మీటర్ల మేర చిట్వేలి -కోడూరు రహదారి పొడి గింపు పనులు చేపట ్టనున్నారు. రాయచోటి నియోజకవర్గ పరిధిలోని 5.6 కిలోమీటర్ల మేర రూ.1.20 కోట్లతో కోనంపేట -గాలివీడు రహదారిని అభివృద్ధి చేయనున్నారు. తంబళ్లపల్లి నియోజకవర్గ పరిధిలోని రూ.7.80 కోట్లతో 23.200 కిలోమీటర్ల మేరకు అభివృద్ధి పరచనున్నారు. మదనపల్లి నియోజకవర్గ పరిధిలో 19.70 కిలోమీటర్ల మేర రూ.4.80 కోట్లతో మదనపల్లి- చేబకూరు-రామసముద్రం రహదారి నిర్మాణ పనులు చేపట్టనున్నారు. మదనపల్లి నియోజకవర్గ పరిధిలో రూ.5 కోట్లతో మదన పల్లి-కందూరు-నిమ్మనపల్లి రహదారిని 19 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయనున్నారు. వెరసి 81.90 కి.మీటర్ల మేర రహదారి నిర్మాణ పనులు చేపట్టనున్నారు.
కడప జిల్లాలో జమ్మలమడుగు నియో జకవర్గ పరిధిలో రూ.2.50 కోట్లతో 5.8 కిలో మీటర్ల మేర రహదారి నిర్మాణ పనులు చేపట్ట నున్నారు. బద్వేల్ నియోజకవర్గ పరిధిలో రూ.5.20 కోట్లతో 12 కిలోమీటర్ల మేర మైదు కూరు-తాటిచెర్ల రహదారి నిర్మాణ పనులు చేపట్ట నున్నారు. మైదు కూరు నియోజకవర్గ పరిధిలో రూ.2.50 కోట్లతో నాగసానిపల్లి-మల్లేపల్లి రహ దారి మీదుగా గంగాయపల్లి-మిట్టమానుపల్లి వరకు ఆరు కిలోమీటర్ల మేరకు రహదారి నిర్మా ణాలు చేపట్టనున్నారు. కడప జిల్లాలో 23 కిలో మీటర్ల మేరకు రహదారులను అభివృద్ధి చేయనున్నారు.
టెండర్ల గండాన్ని అధిగమించేనా!
ప్రభుత్వం తొమ్మిది రహదారి నిర్మాణ పనులకు సంబంధించి జిఒజారీ చేసిన నేపథ్యంలో ఆర్‌అండ్‌బి డిపార్టుమెంట్‌కు సవాలు ఎదురు కానుంది. రహదారి నిర్మాణ పనులకు టెండర్ల ప్రాసెస్ నిర్వహించడానికి నెల రోజుల సమయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో రహదారి నిర్మాణ పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు చేయడం లేదనే వాదన పెద్దఎత్తున వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో కాంట్రాక్టర్లు టెండర్లు వేయడానికి ముందుకు రాని పరిస్థితుల్లో రహదారి నిర్మాణ పనులు చేపట్టడం ఆర్‌అండ్‌బి డిపార్టుమెంట్‌కు పెనుసవాలుగా మారే అవకాశం కనిపిస్తోంది.










