Sep 13,2023 00:18

రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే ధనలక్ష్మి, ఎమ్మెల్సీ అనంతబాబు

ప్రజాశక్తి-మారేడుమిల్లి

మండలంలోని పలు రహదారుల నిర్మాణానికి ఎమ్మెల్సీ అనంతబాబు, రంపచోడవరం ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మి మంగళవారం శంకుస్థాపనలు చేశారు. తాడేపల్లి పంచాయతీ పరిధి గురుమామిడి నుండి తాడేపల్లి గ్రామం వరకు మూడు కిలోమీటర్ల మేర కోటి 15 లక్షల రూపాయలతో బీటీ రోడ్డు నిర్మాణానికి, కెవి.లంక నుండి టేకుల వీధి వరకు రూ.50 లక్షలతో సిసి రోడ్డు నిర్మాణానికి, నీలవరం నుండి గాలిగోపురం వరకు మూడు కిలోమీటర్ల మేర కోటి 50 లక్షల రూపాయలతో డబ్ల్యుబిఎం రోడ్డు, తాడేపల్లి నుండి వేటుకూరు గ్రామం వరకు నాలుగు కిలోమీటర్ల మేర కోటి 20 లక్షల రూపాయలతో డబ్ల్యుబిఎం రోడ్డు, సున్నంపాడు పంచాయతీ పరిధి సున్నంపాడు నుండి నూరుపూడి గ్రామానికి ఐదు కిలోమీటర్ల మేర రూ.3.50 కోట్లతో బీటీ రోడ్డు, కుండాడ పంచాయతీ పరిధి జిఎం వలస జంక్షన్‌ నుండి కుండాడ గ్రామానికి మూడు కిలోమీటర్లు మేర కోటి 30 లక్షల రూపాయలతో బీటీ రోడ్డుకు, వేటుకూరు పంచాయతీ పరిధి వేటుకూరు నుండి దేవుడు లంకలు గ్రామానికి రెండు కిలోమీటర్లు మేర రూ.65 లక్షలతో డబ్ల్యుబిఎం రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. నూతన పింఛన్ల పంపిణీ మండలంలో నూతనంగా మంజూరైన పింఛన్లను మారేడుమిల్లి గ్రామ సచివాలయంలో మంగళవారం ఎమ్మెల్యే ధనలక్ష్మి, ఎమ్మెల్సీ అనంత బాబు మంగళవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో నూతనంగా 83 మందికి కొత్త పింఛన్లు అందించినట్లు తెలిపారు. ఇంకా ఎవరైనా అర్హులుంటే సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లలిత కుమారి, జెడ్పిటిసి బాలాజీ బాబు, వైసిపి మండల కన్వీనర్‌ సత్తి సత్యనారాయణ రెడ్డి, వైస్‌ ఎంపీపీ, పలువురు ప్రజాప్రతినిధులు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారధులు పాల్గొన్నారు.