Jul 20,2023 00:01

చేపలు పడుతూ నిరసన చేపడుతున్న టిడిపి నేతలు

ప్రజాశక్తి-మాడుగుల:వైసిపి ప్రభుత్వ హయాంలో రహదారులు అధ్వానంగా తయారయ్యాని మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు విమర్శించారు. బుదవారం కింతలి ఘాట్‌ రోడ్‌ రహదారి పరిశీలించి మాట్లాడుతూ, రహదారులపై గుంతలు ఏర్పడి నీరు చేరి చేపల చెరువులా మారాయని అన్నారు. ఉపముఖ్యమంత్రి చేసిన అభివృద్ధి ఏదీ అని ప్రశ్నించారు. అనేక అబివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం పాల్పడుతుందని గొప్పలు చెప్పుకోవడం కాదని వాస్తవాలు ప్రజలు సైతం గమనిస్తున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా చేపల వలలతో రహదారిపై నిరసన చేపట్టారు.
అనంతరం అవూరువాడలో సీతారామ స్వామి దేవాలయానికి రామానాయుడు 50 బస్తాల సిమెంట్‌ బుధవారం విరాళంగా అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ చింతలపాటి బుజ్జి, టిడిపి నేతలు కాశిబాబు, సూర్యనారాయణ రాజు, రాజకుమార్‌, అప్పన రమణ, బాబ్జి, సోమన్న దొర, వలసయ్య రాంబాబు తదితరులు పాల్గొన్నారు.