ప్రజాశక్తి-యంత్రాంగం
రహదారులు గుంతలమయం కావడంపై విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో పలుచోట్ల టిడిపి, జనసేన ఆధ్వర్యాన నిరసనలు తెలిపారు.
గాజువాక : చినగంట్యాడ జగ్గు జంక్షన్ ప్రధాన రహదారిపై గోతుల్లో మొక్కలు నాటి టిడిపి, జనసేన నాయకులు వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విశాఖ పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, జనసేన పిఎసి సభ్యులు కోన తాతారావు మాట్లాడుతూ, రహదారుల నిర్వహణలో ఈ ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన నాయకులు ప్రసాదుల శ్రీనివాస్, గడసల అప్పారావు, తిప్పల రమణారెడ్డి, గంధం శ్రీనివాసరావు, దల్లి గోవిందరెడ్డి, గంధం వెంకటరావు, మహమ్మద్ రఫీ, సర్వసిద్ధ అనంత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
మధురవాడ : జివిఎంసి 5వ వార్డు పరిధి మారికవలస నుంచి కాపులుప్పాడ వెళ్లే రహదారిలో టిడిపి, జనసేన ఆధ్వర్యాన 'గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేది' పేరుతో ఆదివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా భీమిలి నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి కోరాడ రాజబాబు, జనసేన నాయకుడు బివి.కృష్ణయ్య మాట్లాడుతూ, గుంతల రహదారులతో రాష్ట్ర ప్రజలు పడుతున్న అవస్థలు ముఖ్యమంత్రికి కనిపించడంలేదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన నాయకులు మొల్లి లక్ష్మణరావు, నమ్మి శ్రీను, నాగోతి శివాజీ, దాసరి శ్రీనివాసరావు, గరే గురునాథ్, దొరబాబు, శాఖరి శ్రీనుబాబు, నాగోతి నరసింహనాయుడు, దేవర శివ, శ్రీకాంత్‌రెడ్డి, తమ్మిన అప్పలరాజు, పీకేటి శ్రీను, జగుపల్లి నాని, ఆకుల శివ,తదితరులు పాల్గొన్నారు.
పెందుర్తి: పినగాడి జంక్షన్ నుంచి వేపగుంట వెళ్లే రహదారిలో టిడిపి, జనసేన నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఇన్‌ఛార్జి పంచకర్ల రమేష్‌బాబు మాట్లాడుతూ, రోడ్ల దుస్థితిపై జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం మొద్దు నిద్ర విడనాడాలని కోరారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ, వేపగుంట నుంచి పినగాడి రోడ్డుకు శంకుస్థాపన చేసి కూడా పనులు ప్రారంభించలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఇరు పార్టీల నాయకులు పాల్గొన్నారు.
కశింకోట : రహదారుల్లోని గుంతలను నెలరోజుల్లో పూడ్చకుంటే మంత్రి అమర్‌ను రోడ్లపై తిరగనివ్వబోమని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ , నియోజకవర్గ జనసేన ఇంచార్జీ పరుచూరి భాస్కరరావు హెచ్చరించారు. తాళ్లవలసలో గుంతులతో నిండి, అధ్వానంగా ఉన్న నర్సీపట్నం రోడ్డులో టిడిపి, జనసేన నేతలు బైఠాయించి నిరసన చేపట్టారు. రోడ్లపై గుంతలు పుడ్చకపోతే టీడీపి- జనసేన శ్రేణులు భిక్షాటన చేసి మరమ్మత్తులు చేస్తామన్నారు. 30రోజులలో రోడ్లను మరమ్మత్తులు చేయకపోతే మంత్రి గుడివాడ అమర్నాథ్ ను రోడ్లపై తిరగనివ్వబోమని హెచ్చరించారు. కార్యక్రమంలో టిడిపి, జనసేన నాయకులు కోట్ని బాలాజీ, కాయల మురళి ఉగ్గిని రమణ మూర్తి, పావడా కామరాజు పాల్గొన్నారు.