Jul 22,2022 23:17

ప్రదర్శనను తిలకిస్తున్న కెకె.రాజు

ప్రజాశక్తి - మాధవధార/ కంచరపాలెం : ఐదో జోన్‌ పరిధిలోని వార్డుల్లో రూ.1.70కోట్లతో చేపట్టిన రహదారుల మరమ్మతులు, అభివృద్ధిపై నాడు-నేడు పేరిట ఫొటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశారు. మాధవదార మాధవస్వామి కల్యాణ మండపంలో నిర్వహించిన ఫొటో ప్రదర్శనను జివిఎంసి కమిషనర్‌ డాక్టర్‌ లక్ష్మిశ, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర నెడ్‌క్యాప్‌ చైర్మన్‌ కెకె రాజుతోపాటు పలువురు అధికారులు నేతలు పరిశీలించారు జివిఎంసి ఎస్‌ఇ కె.వేణుగోపాల్‌ పర్యవేక్షణలో నిర్వహించిన ఎగ్జిబిషన్‌లో కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ కట్టమూరి సతీష్‌, కార్పొరేటర్లు రెయ్యి వెంకటరమణ, కంటిపాము కామేశ్వరి, ఆళ్ల లీలావతి, గంటల కవిత, జెడ్‌సి మల్లయ్యనాయుడు, బగాది విజరుకుమార్‌, కృష్ణారావు, ఇఇ శ్రీనివాస్‌, డిఇ భరణికుమార్‌, ఎఇలు మోహన్‌, కిరణ్‌వర్క్‌ ఇన్స్పెక్టర్లు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.
ములగాడ : ఐదో జోన్‌ పరిధిలో రోడ్లు మరమ్మతులు, అభివృద్ధిపై నాడునేడు పేరుతో శ్రీహరిపురం గుల్లలపాలెం ఇంజనీరింగ్‌ కార్యాలయం వద్ద ఫొటో ఎగ్జిబిషన్‌ను పశ్చిమ నియోజకవర్గ వైసిపి సమన్వ్యయకర్త ఆడారి ఆనంద్‌కుమార్‌ తిలకించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నారని, అయితే విపక్షాలు బురద చల్లుతున్నా, విచక్షణ కలిగిన ప్రజలు ఏది వాస్తవమో గ్రహించగలరని ఆశాభావం వ్యక్తం చేశారు.