Jul 21,2022 23:09

ప్రదర్శనను తిలకిస్తున్న ఎమ్మెల్యే.

ప్రజాశక్తి-పిఎం పాలెం/ భీమునిపట్నం : మధురవాడలోని జివిఎంసి రెండో జోన్‌ కార్యాలయంలో 5 నుంచి 13 వార్డుల పరిధిలో చేపట్టిన రహదారుల అభివృద్ధి పనులకు సంబంధించి ఫొటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశారు. భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు అధికారులతో కలిసి ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ముత్తంశెట్టి మాట్లాడుతూ ఇప్పటివరకు ఎనిమిది వార్డుల్లో కోట్లాది రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత దూరదృష్టితో అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరిస్తున్నామన్నారు. సిఎం జగన్‌ చేస్తున్న మంచి పనులతో వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక చంద్రబాబు,పవన్‌తోపాటు విపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ అవాస్తవ ఆరోపణలు చేస్తున్నాయన్నారు. కార్యక్రమంలో సిఇ రవికృష్ణరాజు, జోనల్‌ కమిషనర్‌ బొడ్డేపల్లి రాము, ఎస్‌ వెంకటరమణ, డిఇ వంశీ, ఎఇ శ్రీనివాస్‌, ఎ.సుమన్‌, 8వ వార్డు కార్పొరేటర్‌ లొడగల అప్పారావు, 5,6 వార్డుల వైసిపి అధ్యక్షులు పోతిన శ్రీనివాస్‌, బొట్ట అప్పలరాజు, మాజీ కార్పొరేటర్‌ పోతిన హనుమంతు, సీనియర్‌ వైసిపి నాయుకులు పిల్లా సత్యనారాయణ, పిల్లా రమణబాబు, గుంటుబోయిన సంజీవ్‌యాదవ్‌, పిల్లా కృష్ణమూర్తి పాత్రుడు, పిల్లా సూరిబాబు, అల్లాడా లింగేశ్వరరావు, వంకాయల మారుతి ప్రసాద్‌, కొండపల్లి వరలక్ష్మి, కుడితి రామారావు పాల్గొన్నారు.