
రాయచోటి : జిల్లాలో రహదారుల అభివద్ధికి అవసరమయ్యే అటవీ భూమిని తీసుకునేందుకు చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ గిరీష ఆదేశించారు. జిల్లాలో చేపడుతున్న వివిధ జాతీయ రహదారుల అభివద్ధి, ఇతర అంశాలపై అటవీ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తంబళ్లపల్లె-శివపురం రహదారి నుంచి మల్లయ్య కొండ వరకు, వంటి పలు రహదారుల అభివ ద్ధి కోసం అవసరమయ్యే అటవీ భూమిని పొందేందుకు తగు నివేదికలను సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రాజంపేట మండలంలో బిఎస్‌ఎన్‌ఎల్ 4జి టవర్లను ఏర్పాటు చేసేందుకు అవసరమైన అటవీ భూమిని పొందేందుకు, బగ్గిడిపల్లి నుంచి ఎకరోపల్లి గ్రామం వరకు రహదారి అభివద్ధి కోసం అవసరమైన అటవీ భూమిని పొందేందుకు అవసరమైన నివేదికలను త్వరగా పూర్తిచేయాలని రాజంపేట తహశీల్దార్‌ను ఆదేశించారు. చిట్వేలు మండలంలో గ్రామస్తులు ఇచ్చిన వివిధ అభ్యర్థనలను కలెక్టర్ దష్టికి తీసుకువచ్చారు. ఆయా అభ్యర్థనలకు సంబంధించి నివేదికలను త్వరగా సమర్పించాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా అటవీ శాఖ అధికారి, రాయచోటి ఆర్‌డిఒ రంగస్వామి పాల్గొన్నారు.