Aug 14,2023 23:03

రహదారిపై బైఠాయించిన రైతులు

ప్రజాశక్తి -నందిగామ : నందిగామ మండలం రామిరెడ్డి పల్లి గ్రామం రహదారిపై బైఠాయించి టిడిపి ఆధ్వర్యంలో సోమవారం రైతులు నిరసన తెలిపారు. జగ్గయ్యపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్‌ రాజగోపాల్‌ తాతయ్య మాట్లాడుతూ మునేరు ఆయకట్టు ప్రాంతంలో 26,000 వేల ఎకరాలు సాగు భూమి ఉండగా నీళ్లు లేక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. వత్సవాయి మండలం మునేరు పోలంపల్లి డ్యాం వద్ద దగ్గర ఏర్పడిన గండిని పూడ్చి తక్షణమే రైతుకు మేలు చేయాలని డిమాండ్‌ చేశారు. పోలంపల్లి డ్యాం వద్ద ఏర్పడిన గండ్లు మరమ్మతులు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మునీర్‌ ఆయకట్ట గండ్లబడి శిథిలావస్థకు చేరడం వల్ల 20 గ్రామాల్లో 26 వేల ఎకరాల్లో పత్తి ,మిర్చి, మాగాణి పంటలు సాగు చేస్తున్న రైతులు సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. మునేరు ఆయకట్టు రైతులు మాట్లాడుతూ గత నెల రోజుల నుండి నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, వరి వేసిన రైతుల పొలాలు ఎండిపోతున్నాయని, పొలాలు బీడ్లు పడుతున్నయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మన్నే కళావతి తెలుగు రైతు నందిగామ మండల కార్యదర్శి మాజీ సర్పంచ్‌ తోట నాగమల్లేశ్వరరావు, తొర్రగుడిపాడు మాజీ సర్పంచ్‌ చెరుకూరి సాంబశివరావు గొల్లమూడి టిడిపి, నాయకులుపలువురు రైతులు పాల్గొన్నారు.