
రహదారిపై గుంతల్లో చేరిన నీటిని చూపిస్తున్న సిపిఎం నాయకులు కోరాడ ఈశ్వరరావు
ప్రజాశక్తి-పాచిపెంట : మండల కేంద్రంలో ప్రధాన రహదారికి మోక్షం లభించడం లేదు. చిన్నపాటి వర్షం పడినా రహదారిపై గోతుల్లో నీరు చేరడంతో ప్రజలంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదేమార్గంలో రాకపోకలు సాగిస్తున్న అధికారులు సైతం ఏమీ పట్టినట్టుగా రోడ్డుపై గుంతలు కప్పడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో డిప్యూటీ సిఎం రాజన్నదొర దృష్టికి స్థానికులు రోడ్డు సమస్యను తీసుకెళ్లారు. అయినా నేటికీ సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పటికైనా పాచిపెంట మండల కేంద్రంలో ఉన్న రోడ్డుకు మరమ్మతులు చేసి, కాలువ నిర్మాణం చేపట్టాలని సిపిఎం నాయకులు కోరాడ ఈశ్వరరావు, కెవిపిఎస్ నాయకులు కె.అప్పలస్వామి, గౌరీశ్వరరావు కోరారు.