ప్రజాశక్తి-బాపట్ల: బాపట్ల పట్టణంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులలో భాగంగా విద్యుత్ స్తంభాల తొలగింపు, సైడ్ డ్రైనేజీ నిర్మాణలలో అధికారుల మధ్య సమన్వయం లేక అవకతవకలు జరుగుతున్నాయని, క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధిత అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్‌కు, పట్టణ విద్యుత్ ఏఈ పెరుగు శ్రీనివాసరావుకు టిడిపి నాయకులు వినతిపత్రం అందజేశారు. వర్షాల కారణంగా డ్రైనేజీల నుంచి మురుగునీరు పొంగి రోడ్ల మీద నిలవకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జి వేగేశన నరేంద్రవర్మ సూచనల మేరకు వినతిపత్రం అందజేసిన వారిలో పట్టణ పార్టీ అధ్యక్షులు గొలపల శ్రీనివాసరావు, కావూరి శ్రీనివాసరెడ్డి, ఫరీద్ మస్తాన్, రామసుబ్బారావు, వెంకట్రావు పాల్గొన్నారు.










