ప్రజాశక్తి - ముదినేపల్లి
మండల కేంద్రమైన ముదినేపల్లిలో ట్రాఫిక్ కష్టాలు ఎక్కువయాయి. పామర్రు- దిగమర్రు 165 జాతీయ రహదారి విస్తరణ పనులు ముదినేపల్లి ప్రధాన సెంటర్‌లో ముమ్మరంగా జరుగుతున్నాయి. వైకూడలి వద్ద కాంట్రాక్టర్ డ్రెయినేజీల నిర్మాణ పనులు మొదలుపెట్టాడు. పాత రోడ్డు వెంబడి డ్రెయినేజీల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పొక్లెయిన్ మట్టిని తవ్వి రోడ్డు మార్జిన్లల్లో వేస్తుంది. అలాగే డ్రెయినేజీ నిర్మాణాల కోసం తవ్విన గుంతల్లో ఊరిన ఊట, వర్షపు నీటిని పైపుల ద్వారా కార్మికులు రహదారిపైకి వదులుతున్నారు. దీంతో రహదారంతా బురదమయంతో అధ్వానంగా మారుతోంది. ఈ కారణంగా సెంటర్‌లో తరచూ ట్రాఫిక్ స్తంభించిపో వడంతో వాహనచోదకులు, ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నాలుగు రోడ్ల కూడలిలో విస్తరణ పనులు జరుగుతున్న కారణంగా ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదా రులు, ప్రజలు పడుతున్న పాట్లు వర్ణనాతీతంగా మారాయి. సదరు కాంట్రాక్టర్ అధికారుల సూచనలు, గ్రామ సర్పంచి నిమ్మగడ్డ కైకమ్మ, పంచాయతీ కార్యదర్శి సారధి చేసే సలహాలు పాటించకుండా ఇష్టారాజ్యంగా, అడ్డదిడ్డంగా పనులు చేస్తుండడంతో ప్రజలు, వాహనదారులు రహదారిపై రాకపోకలు సాగించేందుకు నానా తిప్పలు పడుతున్నారు. దీనికి తోడు వైకూడలి వద్ద రోడ్డు మార్జిన్లల్లో రహదారికి ఇరువైపులా హోటళ్లు, కొబ్బరిబొండాల దుకా ణాలు, పానీపూరి దుకాణాలు, పూలకొట్లు, కూరగాయల తదితర వ్యాపారాలు నిర్వహి స్తుండడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఎదురెదురుగా రెండు వాహనాలు తప్పుకునే అవకాశం లేకుండా పోయింది. ఉదయం, సాయంత్రం వేళ్లల్లో ట్రాఫిక్ మరింత స్థంభి స్తుంది. దీంతో తరచూ వాహనదారులకు, దుకాణదారుల కు వాగ్వివాదాలు జరుగుతున్నాయి. పలుసార్లు ప్రమాదాలు జరుగుతున్నార ుు. కొందరు వ్యక్తులు తమ బైక్‌లను కూడా రోడ్డు మార్జిన్లల్లో పార్కు చేయడం వంటి కారణాలు కూడా ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్నాయి. అదేవిధంగా సోమవారం సంత రోజున గురజ రోడ్డు సెంటర్‌లో స్తంభిస్తున్న ట్రాఫిక్‌తో ప్రజలు, వాహనదారులు నానా పాట్లు పడుతున్నారు. ఇక్కడ కూరగాయల దుకాణాలపైకి కూడా వాహనాలు దూసుకెళ్తున్నాయి. దీంతో కూరగా యలు ధ్వంసం అవుతున్న సంఘటనలు కూడా తరచూ చోటు చేసుకుంటున్నాయి. దీంతో వాహన దారులకు , కూరగాయల దుకాణాదారు లకు ఘర్షణలు కూడా జరుగుతున్నాయి. తీవ్ర ట్రాఫిక్ వల్ల గురజ రోడ్డు సెంటర్‌లో పలు ప్రమాదాలు జరుగుతూ ప్రజలు క్షతగాత్రులుగా మారుతున్నారు. ఇదంతా పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో జరుగుతున్నా పోలీసులు మాత్రం పట్టించుకోవడంలేదంటూ, ట్రాఫిక్ నియంత్రణ చేయడం లేదంటూ వాహనచోదకులు, ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి ట్రాఫిక్‌పై దృష్టి పెట్టి ప్రజలకు, వాహనచోదకులకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా, ప్రమాదాలు జరగకుండా చూడాలని మండల ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.










