
ప్రజాశక్తి-గుడ్లూరు : గుడ్లూరు మండలం చిన్నలాటరఫీ గ్రామం నుంచి లింగసముద్రం మండలం చిన్నపవని వరకూ గ్రామస్తులు నిర్మించిన గ్రెవెల్ నూతన రహదారిని ఎంఎల్‌ఎ మానుగుంట మహేందర్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. కూరపాటి అంజిరెడ్డి సూరె మాల కొండారెడ్డి చారిటబుల్ ట్రస్టు నిర్వాహకులు ఆధ్వర్యంలో సుమారు రూ. 15 లక్షల వ్యయంతో 4.3 కిలోమీటర్ల రహదారి నిర్మించగా ఎంఎల్‌ఎ ప్రారంభించారు. ఈ సందర్భంగా మహీధర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామస్తులు సహకారంతో చారిటబుల్ ట్రస్టు నిర్వాహకులు మాట్లాడి గ్రావెల్ రహదారి నిర్మించడం సంతోషంగా ఉందని మహేందర్ రెడ్డి తెలిపారు. కూరపాటి అంజిరెడ,ి్డ సూరె మాలకొండ రెడ్డి చారిటబుల్ ట్రస్టు నిర్వాకుల ఆధ్వర్యంలో గ్రామ అభివద్ధి కోసం ఆర్థిక సహాయ సహకారాలు అందించడం అభినందనీయమని ఎంఎల్‌ఎ పేర్కొన్నారు. కూరపాటి ఉమాపతి రెడ్డి, గ్రామ సర్పంచ్ మొగిలి శివ పార్వతి, వైసీపీ మండల కన్వీనర్ కాపులూరు కష్ణ యాదy,్ చెన్నుపాటి ప్రసాదు, మధు రెడ్డి ,చల్లా విగేష్, కష్ణారెడి,్డ నాగేశ్వరరావు, లక్ష్మణ రాజు ఉన్నారు.