Jan 18,2023 22:35

బ్యానర్‌ను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ రవి పఠాన్‌శెట్టి, అధికారులు

ప్రజాశక్తి-అనకాపల్లి
రహదారి భద్రత పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్‌ రవి పఠాన్‌ శెట్టి అన్నారు. స్థానిక కలెక్టర్‌ కార్యాలయంలో రహదారి భద్రత వారోత్సవాల బ్యానర్‌ను జిల్లా రవాణా శాఖ అధికారి ఎం.వీర్రాజు, అడిషనల్‌ ఎస్పీ సత్యనారాయణ, డిఎం అండ్‌ హెచ్‌ఓ డాక్టర్‌ హేమంత్‌తో కలిసి కలెక్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 18 నుంచి 24వ తేదీ వరకు జాతీయ భద్రత వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వారోత్సవాలు భాగంగా ఆటో రిక్షాలు, లారీ, స్కూల్‌, కళాశాల బస్సు డ్రైవర్లు, విద్యార్థులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. రోడ్డు ప్రమాదాల వల్ల కలిగే అనర్ధాలను తెలియజేప్పాలని సూచించారు. పోలీసు, రవాణా, ఇంజనీరింగ్‌, వైద్య శాఖల సమన్వయంతో ప్రమాదాలను నియంత్రించేందుకు కౌన్సిలింగ్‌ నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిపిఓ రామారావు, మోటర్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లు ప్రకాష్‌, రాజన్న, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.