Jan 23,2023 23:59

వాహన డ్రైవర్లతో మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్వేత

ప్రజాశక్తి- చింతూరు
మండల కేంద్రంలో జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా సోమవారం లారీ, టాక్టర్‌, ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్వేత డ్రైవర్లకు ప్రభుత్వ నిబంధనలతో కూడిన సూచనలు తెలియజేశారు. డ్రైవర్లు అందరూ తప్పని సరిగా లైసెన్సు కలిగి ఉండాలని, మద్యం తాగి వాహనాలు నడపరాదని సూచించారు. ప్రమాదకరమైన ప్రదేశాల వద్ద ఏర్పాటు చేసిన సైన్‌ బోర్డులు, సిగల్స్‌ గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆటో మేజిక్‌ లారీ యునియన్స్‌ నాయకులు, వాహనాల డ్రైవర్లు పాల్గొన్నారు.