ప్రజాశక్తి -నక్కపల్లి :జాతీయ రహదారిపై ప్రయాణం సాగించేటప్పుడు తప్పనిసరిగా రోడ్డు నియమ నిబంధనలను పాటించాలని ఎంఈఓ డివిడి ప్రసాద్ సూచించారు. జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా శనివారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో ర్యాలీ, మానవహారం నిర్వహించారు. రహదారి భద్రత నియమాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. రోడ్డుపై ప్రయాణం సాగించేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు, ట్రాఫిక్ రూల్స్‌ను విద్యార్థులకు వివరించారు. పాఠశాలల్లో చదువుతున్న 8,9,10 తరగతి విద్యార్థులకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వైఎస్‌ఆర్ క్రాంతి అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ కె.ఉషాదేవి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జ్ హెచ్‌ఎం ఎన్.అప్పారావు, పీడీ కుందూరు రాజు, సచివాలయం సిబ్బంది శ్రీనివాస్, మహిళా పోలీసులు పద్మ, సునీత, వైఎస్‌ఆర్ క్రాంతి సిబ్బంది, ఉపాధ్యాయులు, అప్పారావు, కుందూరు రాజు, సుందరరావు, సత్తిబాబు, తదితరులు పాల్గొన్నారు.
ఎస్.రాయవరం:వై.ఎస్.ఆర్ క్రాంతి పథం డిఆర్.డి.ఏ. ఆధ్వర్యంలో స్థానిక గురజాడ శీలపాలకం సమీపాన నాలుగు రోడ్ల కూడలిలో రహదారి భద్రతపై అవగహన ర్యాలీ నిర్వహించారు.గురజాడ విగ్రహం నుండి రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడ్డారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భూపతి అప్పారావు, వెలుగు ఏపీఎం రమణ బాబు, వైయస్సార్ సిపి జిల్లా కోశాధికారి బొలిశెట్టి గోవిందరావు, మాజీ ఎంపీపీ శారదా కుమారి పాల్గొన్నారు.










