Oct 02,2023 21:43

రఘురామిరెడ్డికి డిపాజిట్‌ కూడా దక్కదు : డిఎల్‌

ఖాజీపేట : మైదుకూరు నియోజకవర్గం అభివద్ధి జరిగిందంటే అది తన ఆయంలోనే మాజీ మంత్రి డిఎల్‌ రవీంద్రారెడ్డి అన్నారు. ప్రస్తుత వైసిపి ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే రఘురామి రెడ్డి అవినీతికి పాల్పడుతున్నాడే తప్ప అభివద్ధిని ఏమాత్రం పట్టిం చుకోవడం లేదని డిఎల్‌ ఘాటుగా వ్యాఖ్యానించారు. సోమవారం మాజీ మంత్రి డిఎల్‌ తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మైదుకూరు నియోజకవర్గ అభివద్ధి తన హయంలోనే జరిగిందని, ఈ విషయం ప్రలందరికీ తెలుసునని చెప్పారు. తాను వైసిపికి రాజీనామా చేయలేదని, తనను, రఘురామకష్ణంరాజును తీసేయలేదని, కారణాలు ఏవో తమకు తెలియవని డిఎల్‌ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తాను కలిశానని ఎమ్మెల్యే రఘురామిరెడ్డి తెలివి తక్కువతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తాను ఏ పార్టీలో చేరలేదన్నారు. ఎవరిని కలవాల్సిన అవసరం లేదని, దిగజారుడు రాజకీయాలు తాను చేయనని, పార్టీలోకి ఎవరైనా ఆహ్వానిస్తే ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను తప్ప ఎవరిని సంప్రదించాల్సిన అవసరం తనకు రాలేదని స్పష్టం చేశారు. తాను మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తినని గర్వంగా చెప్పగలుగుతానని, మైదుకూరు అభివద్ధి తానే చేశానని వివరించారు. ఎమ్మెల్యే రఘురాం రెడ్డికి అవినీతి తప్ప అభివద్ధి ఎక్కడ చేయలేదని, మోసాలకు పాల్పడుతున్న ఇటువంటి వ్యక్తిని ఉరితీయాలి అన్నారు. నియోజకవర్గంలో ఎక్కడ అన్యాయం జరిగినా తన దష్టికి వస్తే ప్రజల పక్షాన పోరాటం చేసేందుకు తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని అన్నారు. ఇప్పటివరకు నాలుగు సార్లు గాలికి గెలిచావని ఎమ్మెల్యే రఘురాం రెడ్డి పై తీవ్రంగా విమర్శించారు. సుధాకర్‌ యాదవ్‌, రఘురామిరెడ్డిలు తనకు శత్రువులు ఏం కాదని డీఎల్‌ అన్నారు. దమ్ము ధైర్యం ఉంటే ఈసారి జరిగే ఎన్నికల్లో గెలవాలని సవాల్‌ విసిరారు. మైదుకూరులో స్థలం కొని నిర్మాణం చేపట్టి ప్రొద్దుటూరు రిజిష్టర్‌ కార్యాలయంలో ఎలా ఆస్తులు రిజిస్టర్‌ చేయిం చుకుంటావని, దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. నియోజకవర్గంలో మండలానికి ఒక బ్రోకర్‌ ను నియమించుకొని దందాలు సాగిస్తున్నారని ఆరోపించారు. ఆర్‌బికెల గురించి గొప్పగా చెప్పే ప్రభుత్వం గుత్తే దారులకు ఎందుకు బిల్లులు చెల్లించలేదు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని అన్నారు. చంద్రబాబు నాయుడు నీతిపరుడని గవర్నర్‌ అనుమతి లేకుండా అరెస్టు చేయడం అన్యాయమని ఆయన ఎటువంటి తప్పు చేయలేదని అన్నారు. యువతకు రాని ఆలోచనలు కూడా తనకు వస్తుంటాయని అన్నారు. చంద్ర బాబు నాయుడు ఎటువంటి తప్పు చేయడని ఫైబర్‌ నెట్‌లో కూడా ఇటువంటి అక్రమాలు చోటు చేసుకోలేదని అన్నారు. అవినీతితో సంపాదించిన డబ్బుతో కుమారులకు బెంగళూరు హైదరాబాదు విజయవాడ నగరాల్లో ఖరీదైన భవనాలు కొనుగోలు నిజం కాదా అని ప్రశ్నించారు. రఘురామి రెడ్డి పిచ్చి పట్టి వ్యవహరిస్తున్నారని అవినీతి చేష్టలు మితిమీరిపోయాయని విమర్శించారు. ప్రతి పనికి ఒక రేటును పెట్టుకొని దందాలు చేయడం నిజం కాదా అని అన్నారు.