Nov 17,2023 22:56

జ్యోతిప్రజ్వలన చేస్తున్న సబ్‌ కలెక్టర్‌ అథితి సింగ్‌

ప్రజాశక్తి - హెల్త్‌ యూనివర్శిటీ : నెలలు నిండని శిశువులకు చికిత్స అందించడంలో రెయిన్‌ బో చిల్డ్రన్స్‌ హాస్పటల్‌ విశేష కృషి చేస్తుందని పలువురు వక్తలు అన్నారు. రింగురోడ్డు వద్ద గల హోటల్‌ నోవాటెల్‌లో నెలలు నిండకుండా జన్మించిన శిశువులకు తల్లిపాలను దానం చేసిన తల్లులకు సత్కార కార్యక్రమం, ప్రపంచ ప్రీ మెచ్యూరిటీ డే వేడుకలను శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న విజయవాడ సబ్‌ కలెక్టర్‌ అథితి సింగ్‌ మాట్లాడుతూ కొన్ని అనివార్య కారణాల వల్ల నెలలు నిండకుండా శిశువులు జన్మిస్తున్నారని, అటువంటి వారికి చికిత్స అందించడంలో రెయిన్‌బో హస్పటల్‌ విశేష కృషి చేస్తుందని అన్నారు. రెయిన్‌బో చిల్డ్రన్స్‌ హాస్పటల్‌ క్లినికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌.రామ్‌ప్రసాద్‌ మాట్లాడుతూ ప్రపంచ ప్రీ మెచ్యూరిటీ జరుపుకోవడం చిన్నారుల శక్తిని గౌరవించడానికి వారి ప్రయాణంలో కీలకపాత్ర వైద్య సిబ్బందికి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్యులు, వైద్య ప్రముఖులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.